
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 27నవంబర్ (హి.స.)చొరబాటుదారులు ఆధార్(Aadhaar) కార్డులు సంపాదించడంపై సుప్రీంకోర్టు (Supreme Court) ఆందోళన వ్యక్తంచేసింది. ఈ సందర్భంగా పౌరులు కానివారు ఆధార్ కలిగిఉంటే.. వారికి ఓటు హక్కు కూడా ఇచ్చేయాలా? అని ప్రశ్నించింది. ఓటర్ల జాబితాలకు ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)పై విచారణలో భాగంగా అత్యున్నత న్యాయస్థానం ఈ వ్యాఖ్యలు చేసింది.
తమిళనాడు, కేరళ, పశ్చిమ బెంగాల్‌లలో ‘సర్’ కసరత్తుపై ఎన్నికల సంఘం (ఈసీ) నిర్ణయాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా పౌరసత్వానికి ఆధార్ ప్రూఫ్ కాదని స్పష్టం చేసింది. ‘ఆధార్ సామాజిక సంక్షేమ ప్రయోజనాలు అందరికీ చేరేలా చూసుకోవడానికి ఏర్పాటుచేసింది మాత్రమే. రేషన్ కోసం ఆధార్ పొందిన వ్యక్తిని.. ఓటరు చేయలా? విదేశాలకు చెందినవారు ఇక్కడ కార్మికుడిగా పనిచేస్తే.. వారికి కూడా ఓటు హక్కు కల్పించాలా?’ అని ధర్మాసనం ప్రశ్నించింది. ఓటరు నమోదు ఫారం-6లో పేర్కొన్న వివరాలు సరైనవో, కావో నిర్ధరించుకునే అధికారం ఈసీకి ఉందని తేల్చి చెప్పింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ