ఆర్మీలోకి లక్ష మంది అగ్నివీర్‌లు
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 27నవంబర్ (హి.స.): అగ్న
Army recruitment rally in Idukki from September 10 to 16


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}ఢిల్లీ 27నవంబర్ (హి.స.): అగ్నివీర్‌లను భారీఎత్తున సైన్యంలోకి తీసుకునేందుకు రక్షణ శాఖ సిద్ధమవుతోంది. అగ్నిపథ్‌ విధానంలో ఇకపై ఏడాదికి లక్ష మందికి పైగా అగ్నివీర్‌లను భర్తీ చేసుకోవాలని భావిస్తోంది. 2020కి ముందు భర్తీ అయిన జవాన్లు ఏడాదికి దాదాపు 60 వేల మంది చొప్పున ప్రతి సంవత్సరం పదవీవిరమ చేయనున్నారు. కొవిడ్‌ చుట్టుముట్టిన రెండేళ్ల కాలం సైన్యంలోకి భర్తీలు నిలిచిపోయాయి. దానివల్ల రానున్న సంవత్సరాల్లో పదవీవిరమణల కారణంగా తీవ్ర సిబ్బంది కొరతను సైన్యం ఎదుర్కోనుంది. దాదాపు 1.80 లక్షల పోస్టులు ఖాళీ అవుతాయని అంచనా. దానికితోడు నాలుగేళ్ల కోసం భర్తీ చేసుకున్న అగ్నివీర్‌ల పదవీకాలం కూడా వచ్చే ఏడాది చివరికి పూర్తి కానుంది. రక్షణ శాఖ 2022 మధ్యలో అగ్నిపథ్‌ పథకం తెచ్చేనాటికి త్రివిధ దళాల్లో మొత్తం 46 వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో ఆర్మీలోనే 40 వేల మంది సిబ్బందికి కొరత ఉంది. అగ్నిపథ్‌ కింద గరిష్ఠంగా మొత్తం 1.75 లక్షల మంది అగ్నివీర్‌లను మిలిటరీలోకి, దాదాపు 28,700 మందిని వాయుసేవ, నేవీలోకి భర్తీ చేసుకోవాలని అప్పట్లో భావించారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande