
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 27నవంబర్ (హి.స.)నేడు భారతదేశ అంతరిక్ష రంగంలో ప్రైవేట్ సెక్టార్‌లో కొత్త ఆవిష్కరణకు దర్పణంగా నిలిచిన రోజు. హైదరాబాద్‌కు చెందిన స్పేస్ స్టార్టప్ స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ తయారుచేసిన దేశంలో మొదటి ప్రైవేట్ ఆర్బిటల్ రాకెట్ 'విక్రమ్-1'ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరిస్తారు. 2022లో విక్రమ్-ఎస్ సబ్-ఆర్బిటల్ రాకెట్‌తో చరిత్ర సృష్టించిన స్కైరూట్, ఇప్పుడు ఆర్బిటల్ క్లాస్ రాకెట్‌తో భారత అంతరిక్ష పరిశ్రమకు కొత్త డైమెన్షన్‌లు తీసుకువస్తోంది. ఈ ఆవిష్కరణ సమయంలోనే స్కైరూట్‌కి చెందిన 'ఇన్ఫినిటీ క్యాంపస్'ను కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఇది 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న.. దేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రాకెట్ తయారీ కేంద్రం. ఈ క్యాంపస్‌లో ఒక్కో నెలకు ఒక విక్రమ్-1 రాకెట్ తయారు చేసే సామర్థ్యంతో ఉంది. ఇది 2026 నుంచి ప్రతి 3 నెలలకు ఓసారి లాంచ్‌లు చేయడానికి అవకాశం కల్పిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ