
ముంబయి , 27 నవంబర్ (హి.స.)body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}ముంబై, 27 నవంబర్ (హి.స.)
దేశీయ మార్కెట్లు గురువారం లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. ఫెడ్ వడ్డీ రేట్ల కోత అంచనాలు, విదేశీ సంస్థాగత మదుపర్ల (ఎఫ్‌ఐఐలు) కొనుగోళ్లు మార్కెట్ (Stock Market) సెంటిమెంట్‌ను బలపర్చాయి. దీంతో నేటి ట్రేడింగ్‌లో దేశీయ సూచీలు సరికొత్త రికార్డులను తాకాయి. సెన్సెక్స్ తొలిసారి 86వేల మార్క్‌ను దాటగా.. నిఫ్టీ జీవనకాల గరిష్ఠ స్థాయిలో ట్రేడ్ అవుతోంది.
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఉదయం 10.50 గంటల ప్రాంతంలో సెన్సెక్స్ (Sensex) 410 పాయింట్ల లాభంతో 86,021 వద్ద, నిఫ్టీ (Nifty) 83.6 పాయింట్ల లాభంతో 26,288 వద్ద కొత్త గరిష్ఠాల్లో ట్రేడ్ అవుతున్నాయి. నిఫ్టీ గతేడాది సెప్టెంబరులో నమోదైన 26,277 రికార్డ్ మార్క్‌ను తాజాగా అధిగమించింది. ఇక, డాలర్‌తో రూపాయి మారకం విలువ 2 పైసలు పడిపోయి 89.24గా కొనసాగుతోంది.
నిఫ్టీలో హిందాల్కో, ఎల్ అండ్ టీ, ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్, బజాజ్ ఫైనాన్స్ షేర్లు రాణిస్తున్నాయి. టైటాన్ కంపెనీ, అపోలో హాస్పిటల్స్, మ్యాక్స్ హెల్త్‌కేర్, రెడ్డీస్ ల్యాబ్స్, టెక్ మహీంద్రా షేర్లు ఒత్తిడికి గురవుతున్నాయి. రంగాల వారీగా ఆటో, ఫైనాన్షియల్ సర్వీసెస్, లోహ, ఫార్మా, బ్యాంకింగ్ రంగ సూచీలు లాభాల్లో ఉన్నాయి. బుధవారం అమెరికా మార్కెట్లు భారీ లాభాలతో ముగిశాయి.
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ