డాక్టర్ షాహిన్ నా భార్య.. గర్ల్‌ఫ్రెండ్‌ కాదు: ఉగ్ర డాక్టర్‌ ముజమ్మిల్‌ వెల్లడి
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
డాక్టర్ షాహిన్ నా భార్య.. గర్ల్‌ఫ్రెండ్‌ కాదు: ఉగ్ర డాక్టర్‌ ముజమ్మిల్‌ వెల్లడి


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

ఢిల్లీ 27నవంబర్ (హి.స.)కారు బాంబు పేలుడు (Delhi Blast) కేసులో విస్తుపోయే విషయాలు బయటపడుతున్నాయి. నిందితురాలు డాక్టర్‌ షాహిన్‌ షహిద్‌ గర్ల్‌ఫ్రెండ్ కాదని, తన భార్య అని సహ నిందితుడు ముజమ్మిల్ షకీల్ విచారణలో భాగంగా వెల్లడించాడు. 2023లో తమ నిఖా జరిగిందని చెప్పాడు. అల్‌-ఫలా యూనివర్సిటీ సమీపంలోని మతపరమైన ప్రదేశం అందుకు వేదికైందని తెలిపాడు. ఈ మేరకు దర్యాప్తు అధికారులను ఉటంకిస్తూ జాతీయ మీడియా కథనాలు పేర్కొన్నాయి.

2023లో ఆయుధాలు కొనేందుకు ముజమ్మిల్‌కు షాహిన్‌ రూ.6.5 లక్షలు ఇచ్చిందని, 2024లో బాంబర్ ఉమర్ నబీకి ఫోర్డ్ ఎకోస్పోర్ట్ కారు కొనేందుకు రూ.3లక్షలు ఇచ్చినట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ క్రమంలో ముజమ్మిల్, షాహిన్‌ బంధం గురించి బయటకువచ్చింది. దీనిద్వారా షాహిన్‌ (Dr. Shaheen Shahid)కు జైషే మహమ్మద్ మాడ్యూల్‌తో ఉన్న సంబంధాలు వెల్లడవుతాయా..? అనే దిశగా అధికారులు దర్యాప్తు చేస్తున్నట్లు సమాచారం. అలాగే ఆ మాడ్యూల్‌ ఆయుధాలు, పేలుడు పదార్థాలు సమీకరించుకునేందుకు ఆమె రూ.27 లక్షలు-28 లక్షలు ఇచ్చినట్లు సమాచారం. అయితే అది మతపరమైన విరాళమని ఆమె దర్యాప్తులో వెల్లడించినట్లు తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande