
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 28నవంబర్ (హి.స.)దిల్లీ పేలుడు కేసు (Delhi blast)లో జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) తన దర్యాప్తును ముమ్మరం చేసింది. ఫరీదాబాద్ (Faridabad) ఉగ్ర కుట్రలో భాగస్వామి అయిన డాక్టర్ షాహిన్ (Dr Shaheen)ను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) అధికారులు సీన్ రీక్రియేషన్ కోసం నిందితులతో సంబంధమున్న అల్-ఫలా విశ్వవిద్యాలయానికి తీసుకువెళ్లారు. ఉగ్రకుట్ర దర్యాప్తులో భాగంగా ఈ కేసులో అరెస్టు చేసిన ఏడుగురు నిందితులను లఖ్‌నవూ, కాన్పూర్, సహరన్‌పూర్, ఫరీదాబాద్, జమ్మూకశ్మీర్‌లకు తీసుకువెళ్లనున్నట్లు తెలుస్తోంది. అల్-ఫలాలో దర్యాప్తు తర్వాత తదుపరి విచారణ కోసం షాహిన్‌ను లఖ్‌నవూ, కాన్పూర్‌లకు తీసుకువెళ్లనున్నారు.
అనుమానితులకు ఆయా ప్రదేశాల్లోని వ్యక్తులతో ఉన్న పరిచయాలు, ఎవరెవరు వారికి సహకరించారు అనే విషయాలను తెలుసుకోవడానికి ఈ చర్యలు తీసుకుంటున్నట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ