
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 28నవంబర్ (హి.స.)ఢిల్లీలో టేక్ ఆఫ్ అయిన ఎయిర్‌ఇండియా విమానం(Air India flight) ఒకటి.. వెంటనే వెనుదిరిగింది. కాక్‌పిట్(Cockpit)లోకి పొగలు వస్తున్నాయనే సంకేతాలతో ఇలా అర్ధంతరంగా తిరిగి ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి నెలకొన్నట్టు అధికారులు తెలిపారు. అయితే ఈ ఘటనలో ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడ్డారు. సదరు ప్రయాణికులను ప్రత్యామ్నాయ మార్గం ద్వారా వారి గమ్యస్థానాలకు చేర్చినట్టు ఎయిర్‌లైన్స్ పేర్కొంది.
నవంబర్ 27న అహ్మదాబాద్ వెళ్లేందుకు AI2939 విమానం ఢిల్లీ నుంచి బయల్దేరింది. టేక్ ఆఫ్ అయిన కాసేపటికే కార్గో హోల్డ్ ప్రాంతంలో పొగ వచ్చినట్టు సూచన కనిపించిందని ఎయిర్‌లైన్ అధికారులు గుర్తించారు. దీంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే ఆ ఫ్లైట్‌ను ఢిల్లీకి మళ్లించారు. అనంతరం పూర్తిస్థాయి తనిఖీలు నిర్వహించారు. అయితే.. ఆ విమానంలో అలాంటి పొగ వ్యాపించిన సూచనలేవీ కనిపించలేదని తనిఖీ అనంతరం అధికారులు నిర్ధారించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ