
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 28నవంబర్ (హి.స.) వివిధ రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ(సర్) కసరత్తు నిర్వహణలో ఎన్నికల సంఘం (ఈసీ) నిర్వహిస్తోన్న పాత్రపై పిటిషనర్ల తరఫు న్యాయవాది తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఎన్నికల నిర్వహణ ముసుగులో చట్టసభల విధులను ఈసీ తనకు తాను చేపట్టినట్లుగా ప్రస్తుత కసరత్తు జరుగుతోందని సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ విమర్శించారు. రాజ్యాంగ పరిమితులను దాటి నిర్హేతుకమైన నిబంధనలతో పౌరులపై తీవ్ర భారాన్ని ఈసీ మోపుతోందని తెలిపారు. ఓటర్ల అర్హతను నిర్ణయించేందుకు 11 పత్రాలు సమర్పించాలనే నిబంధనలను ఏ చట్టం ప్రకారం ఈసీ విధిస్తోందని ప్రశ్నించారు. అలాంటి చట్టాన్ని చేయాల్సింది పార్లమెంటు లేదా అసెంబ్లీలు మాత్రమేనని, ఎన్నికల సంఘం కాదని పేర్కొన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ