
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ 28నవంబర్ (హి.స.): ఎస్సీ, ఎస్టీలపై వేధింపులు, వివక్ష నిరోధకానికి రూపొందించినట్లుగానే దివ్యాంగులను కించపరిచే వారిని కఠినంగా శిక్షించేందుకు చట్టం తీసుకురావాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. ఈ దిశగా ఆలోచన చేయాలని కేంద్రానికి సూచించింది. యూట్యూబర్ రణ్‌వీర్ అలహాబాదియా, సమయ్ రైనాలకు సంబంధించిన పిటిషన్ల విచారణ సందర్భంగా సీజేఐ జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మల్యా బాగ్చి ధర్మాసనం ఈ విషయాన్ని పేర్కొంది. దివ్యాంగులకు కావాల్సింది గౌరవ, మర్యాదలని.. వారి విజయాలను చాటిచెప్పేందుకు మీ వేదికను (ఆన్‌లైన్ షో) ఉపయోగించాలని యూట్యూబర్‌లకు సూచించింది. ఈ షోలకు దివ్యాంగులను కూడా ఆహ్వానించి, వాటితో వచ్చే నిధులను బాధితుల చికిత్సకు అందజేయాలని ఆదేశించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ