రాష్ట్ర‌ప‌తి ఒడిశా ప‌ర్య‌ట‌న‌లో ఆస‌క్తిక‌ర స‌న్నివేశం
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;fon
President Draupadi Murmu


body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}

భువ‌నేశ్వ‌ర్‌/ఢిల్లీ 28నవంబర్ (హి.స.): రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము గురువారం సొంత రాష్ట్ర‌మైన ఒడిశాలో ప‌ర్య‌టించారు. శాసనసభలో ఎమ్మెల్యేల‌ను ఉద్దేశించి ఆమె భావోద్వేగ‌పూరిత‌ ప్ర‌సంగం చేశారు. పాత రోజుల‌ను గుర్తు చేసుకుని పుల‌కించిపోయారు. ఒడిశా శాస‌న‌స‌భ‌లో ఎమ్మెల్యేగా, మంత్రిగా ఉన్న రోజుల‌ను త‌ల‌చుకున్నారు. మారు మూల గ్రామం నుంచి దేశ అత్యున్న‌త ప‌ద‌వి రాష్ట్ర‌ప‌తి వ‌ర‌కు సాగిన త‌న ప్ర‌స్థానాన్ని స్మరించుకున్నారు. మధుర స్మృతుల‌ను నెమరువేసుకున్నారు. శాస‌న‌స‌భ గ్యాలరీలో మాజీ సహోద్యోగులను చూసి సంతోషం వ్య‌క్తం చేశారు.

తాను ఒడిశా మంత్రిగా ఉన్న‌ప్పుడు అసెంబ్లీలో త‌న కార్యాల‌యంగా ఉన్న 11 నంబ‌ర్ చాంబ‌ర్‌ను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము (Droupadi Murmu) సంద‌ర్శించారు. బ‌య‌ట‌కు వ‌స్తుండ‌గా జనసమూహం మధ్య ఉన్న వ్య‌క్తిని రాష్ట్ర‌ప‌తి పేరు పెట్టి పిలిచి, యోగ‌క్షేమాలు అడ‌గ‌డంతో ఆయ‌న అమితాశ్చ‌ర్యానికి లోన‌య్యారు. దేశ అత్యున్న‌త ప‌ద‌విలో ఉన్న‌ప్ప‌టికీ త‌న‌ను మ‌ర్చిపోకుండా పేరు పెట్టి పిల‌వ‌డంతో త‌న సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande