
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)
యూరప్లోని ప్రముఖ విమాన నిర్మాణ
సంస్థ ఎయిర్బస్ కీలక ప్రకటన చేసింది. ఎయిర్బస్ A320 విమానాల్లో సోలార్ రేడియేషన్ ప్రభావంతో ఫ్లైట్ కంట్రోల్ సిస్టమ్ డేటా కరప్ట్ అయ్యే ప్రమాదం ఉందని ఎయిర్బస్ హెచ్చరికలు జారీ చేస్తూ రీకాల్ ప్రకటించింది. ఈ హఠాత్పరిణామంతో భారత్లో ఇండిగో, ఎయిరిండియా, ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వంటి ప్రధాన విమానయాన సంస్థల సర్వీసులపై తీవ్ర ప్రభావం పడుతుంది. దేశంలో సుమారు 200 నుంచి 250 ఎయిర్ బస్ A320 సిరీస్ విమానాలకు తక్షణమే సాఫ్ట్వేర్ అప్డేడేట్తో పాటు హార్డ్వేర్ సర్దుబాటు చేయాల్సి ఉందని ఎయిర్బస్ ప్రకటించింది.
కాగా, భారత్లో మొత్తం 560కి పైగా A320 సిరీస్ విమానాలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఇండిగో, ఎయిరిండియా సంస్థలు కీలక ప్రకటనలు చేశాయి. ఎయిర్బస్ టెక్నికల్ అడ్వైజరీ తెలిసిందని, తమ ఫ్లీట్లోని విమానాలపై అవసరమైన అప్డేట్లు సురక్షితంగా, పూర్తి జాగ్రత్తలతో చేపడుతున్నామని రెండు సంస్థలూ ప్రకటించాయి. ఈ ప్రక్రియలో కొన్ని ఫ్లైట్ షెడ్యూల్స్లో స్వల్ప మార్పులు రావచ్చని ఇండిగో పేర్కొంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..