
ఛత్తీస్గడ్, 29 నవంబర్ (హి.స.)
బస్తర్లో 80 శాతం మావోయిజం అంతమైందని మిగిలిన 20 శాతాన్ని గడువులోగా నిర్మూలిస్తామని ఛత్తీస్ గఢ్ డిప్యూటీ సీఎం విజయ్ శర్మ అన్నారు. భవిష్యత్ లో 'బస్తర్ 2.0' అనే కొత్త అభివృద్ధి నమూనాకు శ్రీకారం చుట్టబోతున్నట్లు వెల్లడించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన నిన్న చత్తీస్ గఢ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన వరంగల్ జిల్లాకు చెందిన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు చైతు అలియాస్ శ్యాందాదాపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణకు చెందిన చైతు ప్రస్తుతం బస్తర్ లో పునరావాసం పొందుతున్నారని దీనిని ప్రభుత్వం స్వాగతించిందన్నారు. ఆయనపై రూ. 25 లక్షల రివార్డు ఉందని తెలిపారు. ఇంకా అజ్ఞాతం వీడని వారు వెంటనే జనజీవన స్రవంతిలో రావాలని ఆయన కోరారు. ఆడవుల్లో ఆయుధాలు పట్టుకుని తిరగడంలో ఎలాంటి ప్రయోజనం లేదని భద్రతా దళాలు మావోయిజాన్ని నిర్మూలించేందుకు తమ పోరాటాన్ని పూర్తి చేస్తాయన్నారు. లొంగిపోయిన వారి పునరావాసానికి ప్రభుత్వం కృషి చేస్తుందని భరోసా ఇచ్చారు. ---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..