
కర్ణాటక, 29 నవంబర్ (హి.స.) కర్ణాటక రాష్ట్రంలో పవర్ షేరింగ్ లో
భాగంగా డీకే శివకుమార్ కు సీఎం పదవి ఇవ్వాలని ఆయన తరఫున ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టుబడుతున్న విషయం తెలిసిందే. ఈ వ్యవహారం ప్రస్తుతం అధిష్ఠానం వద్దకు వెళ్లింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అధికార పోరును పరిష్కరించే దిశగా సీఎం సిద్దరామయ్య మరియు ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ శనివారం ఉదయం అల్పాహార విందు కోసం సమావేశమయ్యారు. పార్టీలో కొనసాగుతున్న సంక్షోభాన్ని పరిష్కరించేందుకు ఇరువురూ చర్చలు జరుపుతున్నారు.
ఈ సమావేశం అనంతరం, డీకే శివకుమార్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, అగ్ర నాయకుడు రాహుల్ గాంధీతో సహా పార్టీ హైకమాండ్ను కలిసేందుకు ఢిల్లీకి పయనం కానున్నారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు