'ఆపరేషన్ సాగర్ బంధు'.. ఆపదలో ఉన్న శ్రీలంకకు భారత్ భారీ సహాయం
హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.) శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 56 మంది మృతి చెందినట్టు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ ''ఆపరేషన్ సాగర్ బంధ
శ్రీలంక


హైదరాబాద్, 29 నవంబర్ (హి.స.)

శ్రీలంకలో వరదలు బీభత్సం

సృష్టిస్తున్నాయి. దేశవ్యాప్తంగా భారీ వర్షాల కారణంగా కొండచరియలు విరిగిపడటంతో 56 మంది మృతి చెందినట్టు ప్రభుత్వ విపత్తు నిర్వహణ కేంద్రం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో భారత్ 'ఆపరేషన్ సాగర్ బంధు'లో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది. కష్టాల్లో ఉన్న పొరుగు దేశాన్ని ఆదుకునేందుకు శ్రీలంకకు భారత్ భారీ సహాయం అందించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి డాక్టర్ ఎస్. జైశంకర్ ట్విట్టర్ ద్వారా ఒక కీలక ప్రకటన చేశారు. శ్రీలంకలో విపత్తు బాధితులకు సహాయం అందించేందుకు భారత ప్రభుత్వం చేపట్టిన 'ఆపరేషన్ సాగర్ బంధు' మొదలైందని, ఈ ఆపరేషన్లో భాగంగా, భారత వైమానిక దళానికి చెందిన C-130 J విమానం కొలంబోలో దిగిందని ట్వీట్ చేశారు.

విమానంలో సుమారు 12 టన్నుల మానవతా సహాయ సామగ్రిని శ్రీలంకకు పంపారు. ఈ సహాయంలో అత్యవసరమైన వస్తువులైన టెంట్లు, టార్పాలిన్లు, దుప్పట్లు (బ్లాంకెట్స్), పరిశుభ్రతా కిట్లు (హైజీన్ కిట్స్), తినడానికి వీలైన ఆహార పదార్థాలు (రెడీ-టు-ఈట్ ఫుడ్ ఐటమ్స్) ఉన్నాయని మంత్రి జైశంకర్ తమ ట్వీట్లో పేర్కొన్నారు. విపత్తు సమయంలో పొరుగు దేశానికి భారత్ తక్షణ సహాయం అందించడం ద్వారా ఇరు దేశాల మధ్య మంత్రి బంధాన్ని మరింత బలోపేతం చేసిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఇదిలా ఉంటే గతంలో కూడా భారత్ శ్రీలంకకు సహాయం అందించింది. అవసరమైతే మరిన్ని మానవతా సహాయ సామగ్రిని అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande