
న్యూఢిల్లీ, 29 నవంబర్ (హి.స.) డిసెంబర్ 1వ తేదీ నుంచి పార్లమెంటు
శీతాకాల సమావేశాలు జరగనున్నాయి. ఈ క్రమంలో రేపు అఖిలపక్ష భేటీ జరగనుంది. ఆదివారం ఉదయం 11 గంటలకు కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలో అఖిలపక్షాలు భేటీ కానున్నాయి. డిసెంబర్ 19వ తేదీ వరకూ జరగనున్న శీతాకాల సమావేశాల్లో ఓటర్ల జాబితాల స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR)పై ప్రభుత్వాన్ని సిద్ధమవుతున్నాయి. ప్రశ్నించేందుకు ప్రతిపక్షాలు అలాగే జాతీయగతమైన వందేమాతరంపై రేగిన వివాదం పై ఒక రోజంతా చర్చ జరపాలని డిమాండ్ చేయాలని భావిస్తున్నారు. పార్లమెంట్ సమావేశాల ప్రారంభంలోనే వందేమాతరంపై చర్చ జరగాలని ప్రభుత్వం కోరుకుంటోంది. రేపు జరిగే అఖిలపక్ష సమావేశంలో ప్రతిపక్షాలతో కేంద్రం మాట్లాడనున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..