వివాదాలు మా స్వభావంలో భాగం కాదు: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్
నాగపూర్, 29 నవంబర్ (హి.స.) మహారాష్ట్రలోని నాగ్పూర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ వివాదాలు లేవని, వివాదాలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. వివాదాలు మా స్వభావంలో
మోహన్ భాగవత్


నాగపూర్, 29 నవంబర్ (హి.స.)

మహారాష్ట్రలోని నాగ్పూర్ వేదికగా

జరిగిన కార్యక్రమంలో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తమకు ఎవరితోనూ వివాదాలు లేవని, వివాదాలకు దూరంగా ఉంటామని స్పష్టం చేశారు. వివాదాలు మా స్వభావంలో భాగం కాదు. అందరితో కలిసి ముందుకు సాగడం మా స్వభావం, సంస్కృతి అని ఆయన తెలిపారు. ఈ సంస్కృతి అనేక విదేశీ దేశాల మాదిరిగా లేదని ఆయన అభిప్రాయపడ్డారు. భారతీయ 'రాష్ట్ర' (Rashtra) భావన ఇతర దేశాల 'నేషనల్' (Nation) భావన కంటే చాలా భిన్నమైనదని ఆయన ఈ సందర్భంగా ఉద్ఘాటించారు.

అలాగే భారతదేశంలో జాతీయవాదం

ఒక సమస్యే కాదని మోహన్ భాగవత్ అన్నారు. మన 'రాష్ట్రం' ఎల్లప్పుడూ ఇక్కడే ఉంది. మనం జాతీయత అనే భావనను విశ్వసిస్తాము, మనం 'నేషన్హుడ్' జాతీయవాదాన్ని కాదు. (Nationhood) అనే భావనను కూడా విశ్వసిస్తాము అని ఆయన వివరించారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande