
చెన్నై , 29 నవంబర్ (హి.స.)దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులకు శుభవార్త. 2026 జనవరి 1 నుండి నాన్-ఏసీ స్లీపర్ కోచ్‌లలో బెడ్‌షీట్, పిల్లో సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. ఈ సేవ ప్రస్తుతానికి చెన్నై డివిజన్‌లోని ఎంపిక చేసిన 10 రైళ్లలో మాత్రమే. ఇది ఉచితం కాదు.
రైల్వే ప్రయాణికులకు దక్షిణ రైల్వే శుభవార్త చెప్పింది. 2026 నూతన ఏడాది ఆరంభం సందర్భంగా ఒక గిఫ్ట్‌ను అందించేలా చర్య చేపట్టనుంది. అదేంటంటే.. ఇప్పటి వరకు కేవలం ఏసీ బోగిల్లోనే ప్రయాణికులకు బెడ్‌షీట్, పిల్లో అందించేవారు. కానీ, ఇక నుంచి నాన్ ఏసీలోని స్లీపర్స్‌లో కూడా బెడ్‌షీట్, పిల్లో ఇవ్వనున్నారు. ఈ సౌకర్యం 2026 జనవరి 1 నుంచి ప్రారంభించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. అయితే ఈ సౌకర్యం ప్రస్తుతానికి కేవలం చెన్నై డివిజన్‌లోనే అందుబాటులో ఉంది. అది కూడా ఎంపిక చేసిన ఓ 10 రైళ్లలో ఇవ్వనున్నారు.
కాగా ఈ సర్వీస్ ఉచితం కాదు. ఇందుకోసం అదనంగా డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఒక బెడ్ షీట్, ఒక పిల్లో, ఒక పిల్లో కవర్ కోసం రూ.50, ఒక పిల్లో, పిల్లో కవర్ కోసం రూ.30, కేవలం బెడ్ షీట్ అయితే రూ.20 చెల్లించాల్సి ఉంటుందని దక్షిణ రైల్వే వెల్లడించింది. అయితే ఈ సౌకర్యం ఏ రైళ్లో ఉందో కూడా తెలిపింది. దక్షిణ రైల్వే జారీ చేసిన ప్రకనటలో ఆ వివరాలు తెలిపింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV