
డిల్లీ, 29 నవంబర్ (హి.స.)
తుఫాను కారణంగా శ్రీలంకలో భారీ
నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో అక్కడ ఆకస్మిక వరదలు సంబవించి బీభత్సం సృష్టిస్తున్నాయి. వరదల కారణంగా వేలాది మంది భారతీయులు, పర్యాటకులు అక్కడే చిక్కుకొని పోయారు. దీంతో.. శ్రీలంకలోని భారత పౌరులకు సహాయం అందించేందుకు భారత హైకమిషన్ చర్యలు చేపట్టింది.
కొలంబోలోని బండారునాయకే అంతర్జాతీయ విమానాశ్రయం (BIA) వద్ద ప్రత్యేకంగా 'ఎమర్జెన్సీ హెల్ప్ డెస్క్'ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. శ్రీలంకలోని విమానాశ్రయాల్లో లేదా దేశంలోని ఏ ప్రాంతంలోనైనా ఇబ్బందుల్లో ఉన్న భారత పౌరులు సహాయం కోసం ఈ ఎమర్జెన్సీ నంబర్+94 773727832 (ఈ నంబర్ వాట్సాప్కు కూడా అందుబాటులో ఉంది) ను సంప్రదించవచ్చని ప్రకటించింది. ప్రస్తుతం BIA విమానాశ్రయంలో చిక్కుకున్న భారతీయ ప్రయాణికులకు అవసరమైన అన్ని సహాయాలను, ముఖ్యంగా ఆహారం, నీటిని అందిస్తున్నట్లు భారత హైకమిషన్ తమ ట్విట్టర్ ఖాతా ద్వారా తెలియజేసింది. విపత్కర పరిస్థితుల నేపథ్యంలో భారత పౌరుల భద్రతకు, సహాయానికి హైకమిషన్ కట్టుబడి ఉందని ప్రకటించింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..