పేదల కోసం అర్ధరాత్రైనా కోర్టులోనే కూర్చుంటా.. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
న్యూఢిల్లీ, 29 నవంబర్ (హి.స.) నిరుపేదలకు న్యాయం అందించేందుకు తాను అత్యంత ప్రాధాన్యతను ఇస్తానని.. వారి కోసం అవసరమైతే అర్ధరాత్రి వరకు అయినా కోర్టులో కూర్చుంటానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్మాల్
సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్


న్యూఢిల్లీ, 29 నవంబర్ (హి.స.) నిరుపేదలకు న్యాయం అందించేందుకు తాను అత్యంత ప్రాధాన్యతను ఇస్తానని.. వారి కోసం అవసరమైతే అర్ధరాత్రి వరకు అయినా కోర్టులో కూర్చుంటానని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ స్పష్టం చేశారు. జస్టిస్ జోయ్మాల్య బాగ్చీతో కలిసి బెంచ్లో ఉన్న సందర్భంగా శుక్రవారం రాత్రి ఆయన మాట్లాడుతూ.. తిలక్ సింగ్ డాంగి అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తన కోర్టులో లగ్జరీ లిటిగేషన్లకు అవకాశం లేదన్నారు. అలాంటి కేసులు సాధారణంగా ధనవంతులే వేస్తారని కామెంట్ చేశారు.

కోర్టులో చివరి వరసలో ఉన్న అతి చిన్న, అతి పేద వ్యక్తి కోసమే తాను ఉన్నానని అన్నారు. వారి కోసం అవసరమైతే అర్ధరాత్రి వరకు కూర్చునేందుకు అత్యంత ప్రాధాన్యతను ఇస్తానని స్పష్టం చేశారు. కాగా, నవంబరు 24, 2025న హర్యానా హిస్సార్ జిల్లాలో మధ్యతరగతి కుటుంబంలో జన్మించిన జస్టిస్ సూర్యకాంత్, భారత 53వ ప్రధాన న్యాయమూర్తిగా ఇటీవలే ప్రమాణ స్వీకారం చేశారు. ఆయన 2027 ఫిబ్రవరి 9న 65 ఏళ్లు నిండి పదవీ విరమణ చేస్తారు. తాజాగా సీజేఐ సూర్యకాంత్ చేసిన ప్రకటన నేపథ్యంలో సామాన్య ప్రజలు, న్యాయవాదులు ప్రశంసలు కురిపిస్తున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande