
హైదరాబాద్, 3 నవంబర్ (హి.స.)
, : బస్సు టికెట్ రిజర్వేషన్, ఛార్జీల చెల్లింపులను మరింత సులభతరం చేయడంపై ఆర్టీసీ యాజమాన్యం దృష్టిపెట్టింది. ప్రస్తుతం ఆర్టీసీ వెబ్‌సైట్, లేదంటే బస్టాండ్లలో కౌంటర్ల నుంచి ఆన్‌లైన్‌లో టికెట్లు రిజర్వు చేసుకోవాల్సి ఉంది. త్వరలో గూగూల్ మ్యాప్స్ నుంచి ఆర్టీసీ బస్సుల సమాచారం తెలుసుకోవడంతోపాటు.. అప్పటికప్పుడే రిజర్వేషన్ చేసుకునే సదుపాయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు సంస్థ సిద్ధమవుతోంది. అమల్లోకి వస్తే..మొబైల్ ఫోన్‌లో ‘గూగుల్ మ్యాప్స్’లోకి వెళ్లి, ఏ ఊరికి వెళ్లాలనే వివరాలు నమోదుచేసి, ఎక్కాల్సిన బస్సును ఎంచుకుని..డబ్బులు చెల్లిస్తే చాలు..అప్పటికప్పుడు రిజర్వేషన్ ఖరారవుతుంది. మొబైల్‌కే ఈ-టికెట్ వచ్చేస్తుంది. రిజర్వేషన్ ఉన్న బస్సులకే కాకుండా.. రిజర్వేషన్ లేని బస్సుల్లోనూ టికెట్లను ఇదే విధానంలో తీసుకుని, ప్రయాణించే అవకాశం కల్పించనున్నట్లు సమాచారం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ