కాంగ్రెస్కు పేరొస్తుందనే కేసీఆర్ ఆ పని చేయలేదు.. రేవంత్ రెడ్డి ఫైర్
నాగర్ కర్నూల్, 3 నవంబర్ (హి.స.) ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయితే కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతోనే కేసీఆర్ పదేళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లిలో
సీఎం రేవంత్ రెడ్డి


నాగర్ కర్నూల్, 3 నవంబర్ (హి.స.)

ఎస్ఎల్బీసీ ప్రాజెక్టు పూర్తయితే

కాంగ్రెస్ ప్రభుత్వానికి మంచిపేరు వస్తుందనే దురుద్దేశంతోనే కేసీఆర్ పదేళ్లు ఈ ప్రాజెక్టును పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ నాగర్ కర్నూల్ జిల్లా మన్నెవారిపల్లిలో పర్యటించిన సీఎం అక్కడ ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడిన రేవంత్ రెడ్డి.. ఎస్ఎల్ బీసీ టన్నెల్ ప్రాజెక్టు 1983 లో మంజూరైందని దీనిని పూర్తి చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వవం ఎంతో కృషి చేసిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి 30 కిలోమీటర్ల టన్నెల్ నిర్మాణం పూర్తయిందని కానీ కేసీఆర్ (KCR) ప్రభుత్వం పదేళ్లలో మిగతా 10 కి.మీ టన్నెల్ పూర్తి చేయలేకపోయిందని విమర్శించారు. ఈ ప్రాజెక్టులో కమిషన్ కూడా రాదని కేసీఆర్, హరీశ్ రావు ఈ ప్రాజెక్టును పక్కకు పెట్టారని ఆరోపించారు. ఏపీలో జగన్ ప్రభుత్వంపోతిరెడ్డిపాడును విస్తరిస్తుంటే కేసీఆర్ చూస్తూ ఊరుకున్నారని ధ్వజమెత్తారు. రూ. 2 వేల కోట్లు ఖర్చు చేసి ఉంటే నల్గొండ జిల్లాకు నీరు అందేది కదా అని అని ప్రస్నించారు. గత పదేళ్లలో సాగునీటి ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు కేసీఆర్ ప్రభుత్వం రూ. 1.86 లక్షల కోట్లు చెల్లించింది. ఇందులో రూ. 1.06 లక్షల కోట్లు కేవలం కాళేశ్వరం కాంట్రాక్టర్లకే చెల్లించిందని విమర్శించారు. కృష్ణానదిమీద చేపట్టిన అన్ని ప్రాజక్టులను కేసీఆర్ నిర్లక్ష్యం చేశారని దుయ్యబట్టారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande