
అనపర్తి, 3 నవంబర్ (హి.స.)మొంథా తుఫాను కారణంగా పంట నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం చెల్లించాలని అనపర్తి (Anaparthy) నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి డిమాండ్ చేశారు. పెదపూడి మండలం సంపర గ్రామంలో ఆయన పర్యటించారు. మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పంట పొలాలను దగ్గరుండి పరిశీలించారు. పంట నష్టాన్ని తెలుసుకునేందుకు బాధిత రైతులతో (Farmers) మాట్లాడారు. ఆరుగాలం పండించిన పంట నష్టపోవడం పట్ల రైతులు ఆవేదనను వ్యక్తం చేశారు.
సత్తి సూర్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ పెదపూడి మండలం సంపర గ్రామంలో మొంథా తుఫాను కారణంగా పంట పొలాలు నేలమట్టం అయ్యాయి అన్నారు. దీంతో రైతులు దిక్కుతోచని స్థితికి వెళ్లారన్నారు. ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే నష్ట పరిహారం ప్రకటించి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV