నకిలీ మద్యం.కేసులో.అరెస్టయిన మాజీ మంత్రి వైసిపి నేత.జోగి రమేష్ నెల్లూరు.జైలు కు తరలింపు
అమరావతి, 3 నవంబర్ (హి.స.) అమరావతి: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో వారిద్దర్నీ విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం ఎన
నకిలీ మద్యం.కేసులో.అరెస్టయిన మాజీ మంత్రి వైసిపి నేత.జోగి రమేష్ నెల్లూరు.జైలు కు తరలింపు


అమరావతి, 3 నవంబర్ (హి.స.)

అమరావతి: నకిలీ మద్యం కేసులో అరెస్టయిన మాజీ మంత్రి, వైకాపా నేత జోగి రమేశ్‌, ఆయన సోదరుడు రాముకు న్యాయస్థానం ఈ నెల 13 వరకు రిమాండ్‌ విధించిన నేపథ్యంలో వారిద్దర్నీ విజయవాడ జైలు నుంచి నెల్లూరు జైలుకు తరలించారు. ఆదివారం ఉదయం ఎన్టీఆర్‌ జిల్లా ఇబ్రహీంపట్నంలో జోగి రమేశ్‌ను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. తూర్పు ఎక్సైజ్‌శాఖ కార్యాలయంలో జోగి రమేశ్‌ను సుమారు 12 గంటలపాటు సిట్‌ అధికారులు విచారించారు. ఆయనతోపాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా, కలిపి ప్రశ్నించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దనరావుతో సంబంధాలపై ఆరా తీశారు. వైద్య పరీక్షల అనంతరం ఎక్సైజ్‌శాఖ అధికారులు, పోలీసులు ఆయన్ను న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టారు. అర్ధరాత్రి దాటిన తర్వాత వాదనలు ప్రారంభమయ్యాయి. న్యాయమూర్తి తెల్లవారుజామున 5 గంటలకు రిమాండ్‌ విధిస్తూ తీర్పు ఇచ్చారు. దీంతో తొలుత వారిని విజయవాడ జైలుకు తరలించారు. తాజాగా అక్కడి నుంచి నెల్లూరు జైలుకు తీసుకెళ్లారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande