
అమరావతి, 3 నవంబర్ (హి.స.)
యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్య శాఖల మంత్రి నారా లోకేశ్ పునరుద్ఘాటించారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో ఆంధ్రప్రదేశ్ నెంబర్ వన్ స్థానంలో ఉందన్నారు. ఈ 16 నెలల కూటమి ప్రభుత్వ పాలనలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. సోమవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఆర్సెల్లార్ మిట్టల్ రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడులు పెడుతుందని వివరించారు. అన్ని రంగాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దూసుకుపోతుందని స్పష్టం చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణే తమ ప్రభుత్వం లక్ష్యమని పేర్కొన్నారు. రాష్ట్రంలో విజన్ ఉన్న నాయకత్వం ఉందని చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ