త్వరలో ఆదరణ 3 పథకం. మొదలు/మంత్రి.సవిత
అమరావతి, 3 నవంబర్ (హి.స.) విజయవాడ: త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వెల్లడించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు చెప్పారు. పథకం అమలుపై బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్
త్వరలో ఆదరణ 3 పథకం. మొదలు/మంత్రి.సవిత


అమరావతి, 3 నవంబర్ (హి.స.)

విజయవాడ: త్వరలో ఆదరణ-3 పథకం అమలు చేయబోతున్నట్లు బీసీ సంక్షేమశాఖ మంత్రి సవిత వెల్లడించారు. విజయవాడలో ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ పథకానికి రూ. వెయ్యి కోట్లు వెచ్చించబోతున్నట్లు చెప్పారు. పథకం అమలుపై బీసీ కార్పొరేషన్‌ ఛైర్మన్లు, డైరెక్టర్లతో వర్క్‌షాప్‌ నిర్వహించనున్నట్లు చెప్పారు. నకిలీ మద్యం కేసుపై మంత్రి సవిత స్పందించారు. ఈ కేసుపై వైకాపా సీబీఐ విచారణ కోరడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ‘బాబాయి గొడ్డలిపోటు’పై సీబీఐ దర్యాప్తును వైకాపా ఎందుకు కోరట్లేదని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande