
అమరావతి, 3 నవంబర్ (హి.స.)
బాపట్ల: కర్లపాలెం మండల సత్యవతిపేట వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నిన్న(ఆదివారం) అర్ధరాత్రి ఒంటిగంట సమయంలో కారు, లారీ ఢీకొన్నాయి. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్రగాయాలైనట్లు సమాచారం. స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ