నేడు సీఎం చంద్రబాబు రెండోరోజు లండన్ లో పర్యటన
అమరావతి, 3 నవంబర్ (హి.స.) ఇవాళ లండన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు. అక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిట్జ్ గెరాల్డ్, హిందూజాకు చెందిన
నేడు సీఎం చంద్రబాబు రెండోరోజు లండన్ లో పర్యటన


అమరావతి, 3 నవంబర్ (హి.స.)

ఇవాళ లండన్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రెండో రోజు పర్యటిస్తున్నారు. వివిధ పరిశ్రమలు, సంస్థలకు చెందిన ప్రతినిధులను కలవనున్నారు. అక్టోపస్ ఎనర్జీ గ్రూప్ డైరెక్టర్ క్రిస్ ఫ్రిట్జ్ గెరాల్డ్, హిందూజాకు చెందిన వివిధ సంస్థల ఛైర్మన్లు అశోక్ హిందూజా, ప్రకాష్ హిందూజా, షోమ్ హిందూజాలతో సమావేశం అవకాశం ఉంది. అలాగే, శ్యామ్ కో హోల్డింగ్స్ ఛైర్మన్ సంపత్ కుమార్, ఆ సంస్థ సీఈఓ, డైరెక్టర్లు వైద్యనాధన్, అశ్వినీ సంపత్ కుమార్ లతో పాటు కొసరాజు గిరిబాబు వంటి వారితో సీఎం చంద్రబాబు వరుస భేటీలు నిర్వహించనున్నారు.

అలాగే, వివిధ పారిశ్రామిక వేత్తలతో సీఐఐ నేతృత్వంలో జరగనున్న రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఈ రౌండ్ టేబుల్ భేటీలో బ్రిటిష్ హెల్త్ టెక్ ఇండస్ట్రీ, ఏఐ పాలసీ ల్యాబ్, అరూప్, ఏథెనియన్ టెక్, ఫిడో టెక్, పీజీ పేపర్ కంపెనీ, నేషనల్ గ్రాఫెనీ ఇన్సిటిట్యూట్, వార్విక్ మాన్యుఫాక్చరింగ్ వంటి సంస్థలకు చెందిన ప్రతినిధులు పాల్గొననున్నారు. ఇక, లండన్ లోని ఇండియన్ హైకమిషనర్ దొరైస్వామితోనూ ఏపీ సీఎం భేటీ కానున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, ఏయే రంగాల్లో ఏయే రకాల పరిశ్రమలు ఏర్పాటు అవుతున్నాయనే అంశాన్ని దొరైస్వామికి సీఎం చంద్రబాబు వివరించే అవకాశం ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande