
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ ,,30 నవంబర్ (హి.స.)ఓటరు జాబితాల ప్రత్యేక ముమ్మర సవరణ (ఎస్‌ఐఆర్) గడువును 12 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో మరో ఏడు రోజులు పొడిగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకొంది. ఓటర్లు తమ పేర్లను ఎలక్టోరల్ రోల్స్‌లో తనిఖీ చేసుకొనేందుకు వీలుగా ఈ నిర్ణయం తీసుకొంది. ప్రస్తుతం ఎస్‌ఐఆర్ రెండో దశలో ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, కేరళ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తర్‌ప్రదేశ్, పశ్చిమ బెంగాల్ సహా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీప్, పుదుచ్చేరిలు ఉన్నాయి.
కొత్తగా ప్రకటించిన మార్పుల ప్రకారం ఎన్యూమరేషన్ ప్రక్రియ గడవు డిసెంబర్ 4 నుంచి డిసెంబర్ 11వ తేదీకి మారింది. ఇక రేషనలైజేషన్, రీ ఆరేంజ్‌మెంట్ ఆఫ్ పోలింగ్‌స్టేషన్స్ గడువు డిసెంబర్ 11గా ఉంది. ఇక కంట్రోల్ టేబుల్ అప్‌డేషన్, డ్రాఫ్ట్ రోల్‌ను సిద్ధం చేసే ప్రక్రియ డిసెంబర్ 12-15 వరకు జరగనుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ