కొంత మందికి మన సొంత భాషలే తెలియవు.. ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు
నాగపూర్, 30 నవంబర్ (హి.స.) భారతీయ భాషలు, మాతృభాషల వాడకం తగ్గడంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది భారతీయులకు మన స్వంత భాషలే తెలియదు అనే పరిస్థితులు వచ్చాయన్నారు. ఆదివారం నాగ్ పూర్ లో జరిగిన ఓ బుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల
ఆర్ఎస్ఎస్ చీఫ్ కీలక


నాగపూర్, 30 నవంబర్ (హి.స.)

భారతీయ భాషలు, మాతృభాషల వాడకం తగ్గడంపై ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ ఆందోళన వ్యక్తం చేశారు. కొంతమంది భారతీయులకు మన స్వంత భాషలే తెలియదు అనే పరిస్థితులు వచ్చాయన్నారు. ఆదివారం నాగ్ పూర్ లో జరిగిన ఓ బుక్ రిలీజ్ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన ఆయన.. భాషా వారసత్వం క్షీణిస్తుండటం పట్ల సమాజాం ఆత్మపరిశీలన చేసుకోవాలన్నారు. గతంలో మన సంభాషణలు, రోజువారీ వ్యవహారాలన్నీ సంస్కృతంలోనే ఉండేవి. కానీ ఇప్పుడు కొంత మంది అమెరికన్ ప్రొఫెసర్లు మనకు సంస్కృతం నేర్పుతున్నారని అన్నారు. వాస్తవానికి సంస్కృతం ప్రపంచానికి మనం నేర్పించాల్సిందన్నారు. నేటి తరం పిల్లలకు కొన్ని ప్రాథమిక, సరళమైన పదాలు కూడా తెలియవన్నారు.

ఇంగ్లీష్ మీడియం విద్య తప్పేమి కాదనని, కానీ ఇంట్లో భారతీయ భాషలు మాట్లాడటానికి ఇష్టపడకోపవడం పరిస్థితిని మరింత దిగజార్చుతోందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande