శ్రీలంకలో భారత్ సహాయక చర్యలు వేగవంతం.. ఆపరేషన్ సాగర్ బంధులో ఎమ్ఐ-17 వీ5 హెలికాప్టర్లు: ఐఏఎఫ్
తిరువనంతపురం,, 30 నవంబర్ (హి.స.) శ్రీలంకలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వేగాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) మరింతగా పెంచింది. ''ఆపరేషన్ సాగర్ బంధు''లో భాగంగా కోలంబోలో ఎమ్ఐ-17 వీ5 హెలికాప్టర్లను మోహరించిన
శ్రీలంక వరదలు


తిరువనంతపురం,, 30 నవంబర్ (హి.స.)

శ్రీలంకలో కొనసాగుతున్న సంక్షోభ పరిస్థితుల్లో భారత ప్రభుత్వం చేపట్టిన సహాయక చర్యల వేగాన్ని ఇండియన్ ఎయిర్ఫోర్స్ (IAF) మరింతగా పెంచింది. 'ఆపరేషన్ సాగర్ బంధు'లో భాగంగా కోలంబోలో ఎమ్ఐ-17 వీ5 హెలికాప్టర్లను మోహరించినట్లు IAF తెలిపింది. ఈ మేరకు ఆదివారం భారత వైమానిక దళం ట్వీట్ చేస్తూ ఆపరేషన్కు సంబంధించిన ఫోటోలను పంచుకుంది. ఇది అత్యవసర మానవతా సహాయం, విపత్తు నిర్వహణ (HADR) కార్యకలాపాల కోసం సిద్ధంగా ఉంచినట్లు తెలిపింది.

భారతీయులను భారీ స్థాయిలో తరలించేందుకు ట్రాన్స్పోర్ట్ విమానాలను కూడానూ సిద్ధం చేసినట్లు ఎయిర్ఫోర్స్ వెల్లడించింది. తిరువనంతపురం, హిండన్ (Hindan) ఎయిర్ బేస్ నుంచి అనేక ఎయిన్లిఫ్ట్ మిషన్లు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరిగాయి.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ రావు


 rajesh pande