
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-family:Garamond;font-size:11pt;}.cf1{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf2{font-family:Garamond;font-size:11pt;}.cf3{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ ,,30 నవంబర్ (హి.స.), నవంబర్ 30: పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రేపటి నుంచి అంటే సోమవారం (డిసెంబర్ 1వ తేదీ) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు అధ్యక్షతన ఆదివారం న్యూఢిల్లీలో అఖిలపక్ష సమావేశం జరిగింది. ఈ పార్లమెంట్ శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు సహకరించాలంటూ విపక్ష పార్టీలకు చెందిన సభ్యులను కేంద్రం కోరింది. అలాగే ఈ సమావేశాల్లో సభలో ప్రవేశపెట్టిన బిల్లులను ఆమోదించేందుకు మద్దతు ఇవ్వాలని వారికి విజ్ఞప్తి చేసింది. ఈ సమావేశానికి కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘవాల్, ఎల్. మురుగన్, అనుప్రియ పటేల్‌తోపాటు జైరామ్ రమేశ్ (కాంగ్రెస్), లావు శ్రీకృష్ణ దేవరాయలు (టిడిపి), మిథున్ రెడ్డి (వైసీపీ), సురేష్ రెడ్డి (బిఆర్ఎస్), బాల శౌరి(జనసేన), కమల్ హాసన్, డెరాక్ ఒబ్రెయిన్, తిరుచ్చి శివ, టి.ఆర్ బాలు, కళ్యాణ్ బెనర్జీ సహా పలు పార్టీల పార్లమెంటరీ పక్ష నేతలు హాజరయ్యారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ