
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ ,,30 నవంబర్ (హి.స.): ఎర్రకోట సమీపంలో జరిగిన పేలుడు ఘటనలో ముగ్గురు వైద్యులు, ఒక మత ప్రచారకుడిని దిల్లీ హైకోర్టు 10 రోజుల జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది. వైద్యులు ముజమ్మిల్ గనయీ, ఆదిల్ రాథర్, షాహీనా సయీద్, మత ప్రచారకుడు మౌల్వీ ఇఫ్రాన్ అహ్మద్‌లను శనివారం జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ) దిల్లీ హైకోర్టులో ప్రవేశపెట్టగా... ప్రిన్సిపల్, సెషన్స్ న్యాయమూర్తి జస్టిస్ అంజు బజాజ్ చందనా నిందితులకు జ్యుడీషియల్ కస్టడీ విధించారు. ఈ కేసులో ఎన్‌ఐఏ ఇప్పటివరకు ఏడుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తోంది. మరోవైపు పేలుడు కేసుకు కేంద్రంగా మారిన అల్ ఫలా యూనివర్సిటీలో తాజాగా అధికారులు సోదాలు చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ