
body{font-family:Arial,sans-serif;font-size:10pt;}.cf0{font-weight:bold;font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf1{font-family:Garamond;font-size:11pt;}.cf2{font-family:Nirmala UI,sans-serif;font-size:11pt;}.cf3{font-family:Garamond;font-size:11pt;}.pf0{}
ఢిల్లీ ,,30 నవంబర్ (హి.స.) వాట్సాప్, టెలిగ్రామ్, సిగ్నల్, అరట్టై, స్నాప్‌చాట్, షేర్‌చాట్, జియోచాట్, జోష్ వంటి ప్రముఖ కమ్యూనికేషన్ యాప్‌లకు కేంద్ర ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీ చేసింది. డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికామ్యూనికేషన్స్ (డాట్) ఈ ఆదేశాలను నవంబర్ 28న విడుదల చేసింది. టెలికామ్యూనికేషన్స్ (టెలికాం సైబర్ సెక్యూరిటీ) అమెండ్‌మెంట్ రూల్స్, 2025 ప్రకారం, ఈ యాప్‌లు ఇకపై సిమ్ కార్డు
లేకుండా పనిచేయవు. ఇది భారతదేశంలోని 120 కోట్ల మొబైల్ యూజర్లపై ప్రభావం చూపుతుంది. సైబర్ నేరాల్ని ఆపడానికి కేంద్రం ఈ కొత్త రూల్స్ తెచ్చింది.
ఈ రూల్స్ ప్రకారం, యూజర్ రిజిస్టర్ చేసిన మొబైల్ నంబర్ కలిగిన సిమ్ కార్డు.. ఫోన్‌లో ఉండాలి. సిమ్ తీసివేసినా లేదా ఫోన్ మార్చినా.. వాట్సాప్ లాంటి యాప్ ఆటోమాటిక్‌గా లాగ్‌అవుట్ అవుతుంది. మళ్లీ లాగిన్ అవ్వాలంటే.. ఫోన్‌లో సిమ్ వేసుకోవాల్సిందే. సిమ్ వెయ్యకుండా ఏం చేద్దామన్నా.. యాప్‌లు పనిచెయ్యవు. సిమ్ లేకుండా కూడా యాప్స్ ద్వారా కాల్స్, మెసేజ్‌లు ఇకపై చెయ్యలేరు. అంటే మొబైల్‌లో సిమ్ లేకపోతే, ఇకపై మనం వాట్సాప్ కాల్స్, చాట్ చెయ్యలేం.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ