
నిజామాబాద్, 7 నవంబర్ (హి.స.)
కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో నాశనం చేశారని నిజామాబాద్ ఎంపీ అరవింద్ ధర్మపురి సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్ లోని బిజెపి జిల్లా కేంద్ర కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ కుటుంబం చేసిన పాపానికి సీఎం రేవంత్ రెడ్డి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం రేవంత్ చేస్తున్న అతిపెద్ద పాపమని ఎంపీ అన్నారు. రాబోయే రోజుల్లో ఈ పాపం రేవంత్ రెడ్డికి కచ్చితంగా చుట్టుకుంటుందని అరవింద్ అన్నారు. స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్మెంట్ పాపం కేసీఆర్ దేనని ఆయన అన్నారు.
కేసీఆర్ అధికారంలో ఉన్న పదేళ్లు లెక్కలేనన్ని పాపాలు చేశారన్నారు. కాళేశ్వరాన్ని కట్టి లక్ష కోట్ల రూపాయలు ముంచేసి సముద్రం పాలు చేశాడని, తెలంగాణను అప్పులపాలు చేశాడని కేసీఆర్ పై దుమ్మెత్తి పోశారు. ఫోన్ ట్యాపింగ్, డ్రగ్స్ కేసు, రియల్ ఎస్టేట్ స్కామ్ వంటి ఎన్నో కేసుల్లో రేవంత్ సర్కారు ముందుకెళ్లలేని దుస్థితిలో ఉందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు