మంత్రి రామ్.ప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు కు ధన్యవాదాలు తెలియజేశారు
అమరావతి, 7 నవంబర్ (హి.స.) అమరావతి, వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ( రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వరాలు ఇవ్వండపై రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ( హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లా
మంత్రి రామ్.ప్రసాద్ రెడ్డి సీఎం చంద్రబాబు కు ధన్యవాదాలు తెలియజేశారు


అమరావతి, 7 నవంబర్ (హి.స.)

అమరావతి, వరల్డ్ కప్ గెలిచిన మహిళా క్రికెట్ జట్టు సభ్యురాలు శ్రీచరణికి ( రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా వరాలు ఇవ్వండపై రవాణా, యువజన క్రీడా శాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ( హర్షం వ్యక్తం చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రీడా ప్రతిభకు గుర్తింపుగా శ్రీచరణికి రూ.2.5 కోట్ల నగదు పురస్కారం, కడప జిల్లా స్వగ్రామంలో ఇంటి స్థలం కేటాయించడం కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని చెప్పుకొచ్చారు. శ్రీచరణికి గ్రూప్-1 ఉద్యోగం ప్రకటిస్తూ సీఎం చంద్రబాబు నాయుడు తీసుకున్న నిర్ణయం ఆదర్శనీయమని అన్నారు. క్రీడాకారుల ప్రతిభను గౌరవించే సీఎంకు మంత్రి ధన్యవాదాలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande