నర్సరావుపేట పట్టణంలో కోట సెంటర్ లో ఉన్న స్వాతి షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం
అమరావతి, 7 నవంబర్ (హి.స.) నరసరావుపేట నరసరావుపేట పట్టణంలోని కోట సెంటర్‌లో ఉన్న స్వాతి షాపింగ్ మాల్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని
నర్సరావుపేట పట్టణంలో కోట సెంటర్ లో ఉన్న స్వాతి షాపింగ్ మాల్ లో భారీ అగ్నిప్రమాదం


అమరావతి, 7 నవంబర్ (హి.స.)

నరసరావుపేట నరసరావుపేట పట్టణంలోని కోట సెంటర్‌లో ఉన్న స్వాతి షాపింగ్ మాల్‌లో శుక్రవారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అగ్ని ప్రమాదం కారణంగా దట్టంగా పొగ వ్యాపించడంతో మాల్‌ లోపలికి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. షాపింగ్ మాల్ నిర్వహిస్తున్న మాల్‌ నాలుగు అంతస్తుల్లో పొగ వ్యాపించింది. మాల్‌లో పనిచేస్తున్న మహిళా సిబ్బందిలో ఒకరు ఊపిరాడక పడిపోవడంతో హుటాహుటిన స్థానిక ఆసుపత్రికి తరలించారు. పొగ బయటకు పోయే మార్గం లేకపోవడంతో భవనం రెండో అంతస్తు గోడలను బద్దలుకొట్టి మంటలు అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే చదలవాడ అరవింద బాబు ఘటనా స్థలానికి చేరుకొని పరిస్థితిపై ఆరా తీశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande