గోపీనాథ్ మరణంపై అనుమానాలున్నాయి.. బండి సంజయ్ హాట్ కామెంట్స్
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మరణంపై ఆయన అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ కేడర్లో అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహి
బండి సంజయ్


హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)

దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్

మరణంపై ఆయన అనుచరులు, బీఆర్ఎస్ పార్టీ కేడర్లో అనుమానాలు ఉన్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇవాళ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ ఎన్నికల కమిషన్, పోలీసులు అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించడం లేదని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కొమ్ముకాయడం సిగ్గుచేటని అన్నారు. తెలంగాణలో అధికార, ప్రధాన ప్రతిపక్షం కలిసి పని చేస్తున్నాయని.. కూడబలుక్కొని ఒకరినొకరు తిట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తాము ప్రచార సభలకు అనుమతి కోసం దరఖాస్తు పెట్టుకుంటే జాప్యం చేస్తూ చివరి నిమిషంలో అమమతి ఇవ్వలేమని చెబుతున్నారని సాయంత్రం రహమత్నగర్ సభకు పర్మీషన్ ఇవ్వాలని ఈ నెల 4న దరఖాస్తు చేసుకున్నా.. ఇప్పటి పోలీసులు స్పందించడం లేదన్నారు. సభఎక్కడ పెట్టుకోవాలో వాళ్లు తమకు చెప్పడం ఏంటని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande