
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)
భారత ఎన్నికల కమిషన్ (EC) దేశవ్యాప్తంగా
Special Intensive Revision (SIR) చేపట్టేందుకు నిర్ణయించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మొత్తం 12 రాష్ట్రాలు మరియు 3 కేంద్రపాలిత ప్రాంతాల్లో ఓటరు జాబితాల ప్రత్యేక పునఃసమీక్ష (SIR) కార్యక్రమాన్ని ప్రారంభించింది. అయితే ఈ SIR పై పలు పార్టీలో సుప్రీం కోర్టును ఆశ్రయించారు. తాజాగా దాఖలైన అన్ని పిటిషన్లను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. ఈ పిటిషన్లను నవంబర్ 11న విచారణకు తీసుకుంటామని సుప్రీంకోర్టు పేర్కొంది. జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్మాల్యా బాగ్చీలతో కూడిన బెంచ్ ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ సందర్భంగా ఎన్జఓ అసోసియేషన్ ఆఫ్ డెమోక్రాటిక్ రీఫార్మ్స్ (ADR) తరఫున హాజరైన న్యాయవాది ప్రశాంత్ భూషణ్ మాట్లాడుతూ.. “ఈ అంశం ప్రజాస్వామ్య మూల సూత్రాలకు సంబంధించినది” అని వాదించారు. దీనిపై స్పందించిన బెంచ్ - నవంబర్ 11 నుంచి అనేక ముఖ్యమైన కేసులు షెడ్యూల్లో ఉన్నప్పటికీ, వీలైనంత వరకు ఈ అంశాన్ని కూడా అప్పుడే విచారించేలా చూస్తాం” అని పేర్కొంది. ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం రాజ్యాంగపరమైన పరిమితుల్లో ఉందా లేదా అన్నది ఈ విచారణలో స్పష్టమవుతుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..