హైడ్రా దూకుడు.. 400 గజాల పార్క్ స్థలం స్వాధీనం
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో హైడ్రా దూకుడు పెంచింది. గతంలో దివ్య నగర్ లో దాదాపు 2 వేల ప్లాట్లకు కబ్జా చెర నుంచి విముక్తి కల్పించిన హైడ్రా, ఇటీవల డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్క్ స్థలానికి కంచె వ
హైడ్రా దూకుడు


హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పోచారం మున్సిపల్ పరిధిలో హైడ్రా

దూకుడు పెంచింది. గతంలో దివ్య నగర్ లో దాదాపు 2 వేల ప్లాట్లకు కబ్జా చెర నుంచి విముక్తి కల్పించిన హైడ్రా, ఇటీవల డాక్టర్స్ కాలనీలో 4000 గజాల పార్క్ స్థలానికి కంచె వేసిన విషయం తెలిసిందే. కాగా చౌదరిగూడ సర్వే నెంబర్ 726, 727, 729 లో 400 గజాల పార్క్ స్థలాన్ని రియల్టర్ల కబ్జా కి గురికావడంతో శ్రీనివాస కాలనీ వాసులు హైడ్రాను ఆశ్రయించారు. స్పందించిన హైడ్రా అధికారులు కబ్జాకు గురైన పార్క్ స్థలంలో శుక్రవారం కూల్చివేతలు చేపట్టి హైడ్రా బోర్డులు ఏర్పాటు చేశారు. హైడ్రా పార్క్ స్థలాన్ని స్వాధీనం చేసుకున్నందుకు శ్రీనివాస కాలనీ వాసులు హర్షం వ్యక్తం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande