
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారం జోరుగా కొనసాగుతోన్న వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ ముఖ్య నేత,ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు మొబైల్ ఫోన్ను గుర్తు తెలియని వ్యక్తులు హ్యాక్ (Hack) చేశారు. ఈ పరిణామంతో ఎమ్మెల్సీ తమ వ్యక్తిగత, అధికారిక సమాచార భద్రతపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన తన ఫోన్ హ్యాక్పై సైబరాబాద్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. తాను ఇచ్చిన ఫిర్యాదుపై ఆధారంగా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిపి అందుకు బాధ్యులైన వ్యక్తులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజాప్రతినిధుల కమ్యూనికేషన్ వ్యవస్థను లక్ష్యంగా చేసుకునే ఇలాంటి సైబర్ దాడులు (Cyber Attack) ప్రజాస్వామ్య వ్యవస్థకు అత్యంత ప్రమాదకరమని అన్నారు. తన ఫోన్ నుంచి ఎవరైనా తప్పుడు సందేశాలు లేదా కాల్స్ చేసినట్లయితే వాటిని నమ్మవద్దని శంభీపూర్ రాజు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..