
మెదక్, 7 నవంబర్ (హి.స.)
రైతులు వరి ధాన్యాన్ని
రహదారులపై ఆరబెట్టడం వలన ఇరుకుగా మరి ప్రమాదాలు జరుగుతున్నాయని మెదక్ జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ధాన్యం చుట్టూ రాళ్లు పెట్టడం, బ్లాక్ పాలిథిన్ కవర్లతో కప్పడం వలన రాత్రి వేళల్లో వాహనదారులు అవి గమనించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే కొన్ని చోట్ల ఈ విధంగా ఘటనలు చోటు చేసుకున్నాయని పేర్కొన్నారు. రహదారులపై ధాన్యం ఆరబెట్టడం ప్రజల ప్రాణ భద్రతకు ముప్పు అని అన్నారు. కావున రైతులు గ్రామ పంచాయతీ ప్రాంగణం, ఖాళీ ప్రదేశాలు లేదా రహదారులకు దూరంగా ఉన్న సురక్షిత ప్రదేశాలను ఉపయోగించాలని విజ్ఞప్తి చేశారు. ప్రజల భద్రతలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు