డిసెంబర్ 19 నుంచి హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్: మంత్రి కోమటిరెడ్డి
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.) తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ సంస్థ
మంత్రి కోమటిరెడ్డి


హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)

తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. దాదాసాహెబ్ ఫాల్కే స్కూల్ ఆఫ్ ఫిల్మ్ స్టడీ సంస్థ ద్వారా డిసెంబర్ 19 నుంచి 21 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఇందుకు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా రూ.30 లక్షలు విడుదల చేసినట్లు వెల్లడించారు. మంత్రి కోమటిరెడ్డి ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం ఈమేరకు జీవో విడుదల చేసింది.

అలాగే హైదరాబాద్ ఇంటర్నేషనల్ షార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్ కార్యక్రమంలో అవార్డు ఫంక్షన్ నిర్వహణ కోసం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాలతో 8 మందితో కమిటీ ఏర్పాటు చేశారు. అవార్డుల పునర్వ్యవస్థీకరణ కమిటీ చైర్మన్గా దర్శకుడు దశరథ్ నియామకం అయ్యారు. సభ్యులుగా దర్శకుడు హరీశ్ శంకర్, కళాకారుడు బలగం వేణు, పీజీ వినోద్, రాహుల్ సిప్లిగంజ్, చరణ్ అర్జున్, లక్ష్మీలను నియమించారు. TGFDCL ద్వారా ఈ అవార్డుల కార్యక్రమం నిర్వహించనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande