
ములుగు, 7 నవంబర్ (హి.స.)
వందేమాతరం గీతం ప్రాధాన్యతను చాటి చెప్పేందుకే సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ములుగు జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ అన్నారు. మహాకవి శ్రీ బంకిమ్ చంద్ర ఛటర్జీ “వందే మాతరం జాతీయ గీతాన్ని రచించి 150 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు శుక్రవారం కలెక్టరేట్ సమావేశం హాల్లో అదనపు కలెక్టర్లు సిహెచ్ మహేందర్ జి, సంపత్ రావు, ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి కలెక్టర్ వందేమాతరం గీతాన్ని సామూహిక గానం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి పౌరుడిలో దేశభక్తి భావాన్ని మరింతగా పెంపొందించేందుకు ఈ గీతం ఎంతగానో దోహదపడుతుందని, వందేమాతరం సామూహిక గీతాలాపన కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా చేపట్టడం జరిగిందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు