చేవెళ్ల బస్సు ఘటనతో పోలీసుల అలర్ట్.. అర్ధరాత్రి హైవే పై విస్తృత తనిఖీలు
కామారెడ్డి, 7 నవంబర్ (హి.స.) చేవెళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదం నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా.. ముందు జాగ్రత్త చర్యగా హైవేపై అర్థరాత్రి పెద్ద ఎత్తున విస్తృత తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు
వాహన తనిఖీలు


కామారెడ్డి, 7 నవంబర్ (హి.స.)

చేవెళ్ల వద్ద జరిగిన ఆర్టీసీ బస్సు

ప్రమాదం నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా.. ముందు జాగ్రత్త చర్యగా హైవేపై అర్థరాత్రి పెద్ద ఎత్తున విస్తృత తనిఖీలు చేపట్టారు. కామారెడ్డి జిల్లా భిక్కనూరు 44వ హైవేపై వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్ద గురువారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ తనిఖీలు శుక్రవారం వేకువ జామున 4 గంటల వరకు కొనసాగాయి. రోడ్డుకిరువైపులా వాహనాలను తనిఖీ చేశారు. సర్కిల్ పరిధిలోని పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఆధ్వర్యంలో ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో 27 కేసులు నమోదు చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande