రైతు విజయానికి తొలిమెట్టు విత్తనమే: వ్యవసాయ శాస్త్రవేత్త కళ్యాణి
మహబూబ్నగర్, 7 నవంబర్ (హి.స.) రైతుల విజయానికి తొలిమెట్టు నాణ్యమైన విత్తనమే అని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కే కళ్యాణి పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా ఎర్రవల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యం
వ్యవసాయ శాస్త్రవేత్త


మహబూబ్నగర్, 7 నవంబర్ (హి.స.)

రైతుల విజయానికి తొలిమెట్టు

నాణ్యమైన విత్తనమే అని వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ కే కళ్యాణి పేర్కొన్నారు. శుక్రవారం మహబూబ్నగర్ జిల్లా ఎర్రవల్లి మండలం తిమ్మాపురం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో క్షేత్ర దినోత్సవాన్ని రైతు శివన్న నాయుడు పొలంలో ఆర్ఎన్ఆర్15048 విత్తనం పంట వద్ద నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నాణ్యమైన విత్తనం ద్వారా పంట దిగుబడి, ఆదాయం పెరుగుతాయని తెలిపారు. ఈ విత్తనాన్ని గ్రామంలోని ఇతర రైతులకు ఇవ్వడం వలన వారికి నాణ్యమైన విత్తనం చౌకగా లభిస్తుందన్నారు. రైతులు ఎక్కడో దూరంగా వెళ్లి వేరే మార్కెట్ లో తెలియని రకాలు కొనుగోలు చేయడంకంటే తమ గ్రామంలోని తమ రైతులే పండించిన నాణ్యమైన విత్తనం తీసుకోవడం వలన రైతులకు వ్యయ, ప్రయాసలు తగ్గి సులభంగా విత్తనం అందుబాటులోకి వస్తుందని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande