డ్రగ్స్ నిర్మూలనకు యుద్ధం చేద్దాం: ఇల్లందు పోలీసులు
భద్రాద్రి కొత్తగూడెం, 7 నవంబర్ (హి.స.) డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇల్లందు పోలీస్ ల ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు.ఇందులో ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు,
ఇల్లందు పోలీస్


భద్రాద్రి కొత్తగూడెం, 7 నవంబర్ (హి.స.)

డ్రగ్స్ నిర్మూలనకు జిల్లాలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఇల్లందు పోలీస్ ల ఆధ్వర్యంలో 2కె రన్ నిర్వహించారు.ఇందులో ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు, యువత, ప్రజలు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి. చంద్రభాను మాట్లాడుతూ.. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఆదేశానుసారం చేపడుతున్న డ్రగ్స్ నిర్మూలనలో భాగంగా చేపట్టిన చైతన్యం డ్రగ్స్ పై యుద్ధం కార్యక్రమాల్లో భాగంగా యువత, ప్రజలు, విద్యార్థులు డ్రగ్స్కు దూరంగా ఉండాలని సూచించారు. డ్రగ్స్ సేవించడంతో పాటు విక్రయించడం సరఫరా చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ముఖ్యంగా యువత విద్యార్థులు డ్రగ్స్ కు బానిసలై జీవితాలను అంధకారంలోకి నెట్టుకుంటున్నారని పేర్కొన్నారు. డ్రగ్స్ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande