
హైదరాబాద్, 7 నవంబర్ (హి.స.)
ఈ సంవత్సరం అన్ని కాలాలు కూడా మామూలు కన్నా అధికంగా ఉన్నాయి. ఎండాకాలం తీవ్రమైన ఎండలు దంచికొట్టగా, వర్షాకాలం ఎన్నడూ ఊహించని స్థాయిలో భారీ వర్షాలు కురిశాయి. ఈ క్రమంలో ఈసారి నవంబర్ నెలలో గత ఏడు సంవత్సరాల తర్వాత రికార్డు స్థాయి చలి నమోదు కానుందని వాతావరణ నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే రాత్రి వేళల్లో చలి తీవ్రత పెరిగి ప్రజలు వణికిపోతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చలి మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకిన 'మోంతా తుఫాను' ప్రభావంతో ఈశాన్య రుతుపవనాల దిశ పూర్తిగా మారి, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లో సాధారణ వర్షపాతం తగ్గిపోయింది.
అదే సమయంలో రాబోయే 10-15 రోజుల పాటు పొడి వాతావరణం కొనసాగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాత్రి వేళల్లో తీవ్ర చలి గాలులు వీచే అవకాశం ఉందనీ ఒక దశలో తీవ్రమైన వర్షాలు కురిస్తే, ఆ తర్వాతి దశలో పొడి వాతావరణం తప్పదనే పాఠం ఈ సీజన్ మనకు చెబుతోంది” అని ప్రజలు చలి ప్రభావానికి సిద్ధంగా ఉండాలని వారు సూచించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..