
జోగులాంబ గద్వాల, 7 నవంబర్ (హి.స.)
లారీ-ఆటో ఢీ కొనడంతో ఇద్దరూ
యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన జోగుళాంబ గద్వాల్ జిల్లా రాజోలి మండలం పచ్చర్ల గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. పచ్చర్ల గ్రామానికి చెందిన మహేష్ (20), విశ్వాస్ (16) టొమాటో బాక్సులతో ఆటో లో శాంతినగర్ వైపు వెళ్తుండగా.. జులకల్ వాగు వద్ద లారీ ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఈ ప్రమాదంలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు