
అమరావతి, 7 నవంబర్ (హి.స.) బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయ రచించిన వందేమాతరం (Vandemataram) స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణనిచ్చిన ఓ అగ్నిగీతం అని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు (Kinjarapu Atchannaidu)అన్నారు. వందేమాతరం 150 ఏళ్ల సంస్మరణోత్సవం సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. వందేమాతరం జననీ గీతం పుట్టి 150 ఏళ్లైన (150 Years) ఈ చారిత్రాత్మక సందర్భం దేశ ప్రజలందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. బంకిమ్ చంద్ర చట్టోపాధ్యాయులు రాసిన వందేమాతరం, స్వాతంత్ర్య సమరయోధులకు ప్రేరణనిచ్చిన ఓ అగ్నిగీతమని, ఈ జాతీయ గీతం దేశ భక్తిని, ఏకత్వాన్ని, త్యాగ స్పూర్తిని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మన దేశానికి స్వాతంత్ర్యం (Freedom) తెచ్చిన వీర స్వహుతుల త్యాగాలను స్మరించుకునేందుకు, ఈ గీతం పవిత్రతను మరింతగా పూజించేందుకు ఈ 150 ఏళ్ల సంస్మరణోత్సవం ఎంతో ముఖ్యమని మంత్రి అన్నారు. భారత మాతకు వందనం చేసే ఈ గీతం, దేశ నిర్మాణంలో ప్రతి భారతీయుడికి కొత్త స్పూర్తి నింపాలని ఆకాంక్షించారు. వందే మాతరం అనేది కేవలం ఒక నినాదం కాదు.. మన భారతీయుల అస్తిత్వం, అభిమానం, ఔన్నత్యానికి ప్రతీక అని మంత్రి అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV