
అమరావతి, 7 నవంబర్ (హి.స.) వచ్చే జూన్ 2026 నాటికి భోగాపురం (Boghapuram) అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభించేందుకు అంకిత భావంతో పని చేస్తున్నామని కేంద్ర పౌరు విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు (Kinjarapu Rammohan Naidu) అన్నారు. ఇప్పటికే అంతర్జాతీయ విమానాశ్రయ పనులు 91.7శాతం పూర్తయ్యాయని వెల్లడించారు.
ఈ విమానాశ్రయం పూర్తి స్థాయిలో ప్రారంభమైన తరువాత ఉత్తరాంధ్ర ప్రాంతంలో కనెక్టివిటీ, వాణిజ్యం, పర్యాటక రంగాలకు ప్రధాన ఆర్థిక కేంద్రంగా రూపుదిద్దుకోనుందని ధీమా వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Chandra Babu Naidu) మార్గదర్శకత్వంలో 2026 జూన్ నాటికి నిర్మాణాన్ని పూర్తి చేసి జాతికి అంకితం చేయడానికి కట్టుబడి ఉన్నామని ప్రకటించారు.
నిర్మాణ పురోగతి విమానాశ్రయం (Airport) నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఎర్త్‌వర్క్స్ 100శాతం, రన్‌వే 97శాతం, టాక్సీవే 92శాతం, టెర్మినల్ భవనం పనులు 80శాతానికి పైగా పూర్తయ్యాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV